Home  »  TV News  »  ఉప్పెన మూవీలో సూర్యకాంతం,రేలంగి నటిస్తే ఇలా ఉంటుంది!

Updated : Sep 21, 2022


కృష్ణ భగవాన్ ఇటీవల జబర్దస్త్ షోలు చేస్తూ అందులో  పంచ్ డైలాగ్స్ వేస్తూ  ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆయనతో పాటు నటి ఇంద్రజ కూడా జోక్స్ వేస్తూ పడీ పడీ నవ్వుతూ నవ్విస్తోంది. కృష్ణ భగవాన్ కామెడీ అదుర్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే బేసిక్ గా ఆయన రైటర్. కాబట్టి ఎప్పుడు ఏ టైములో ఏ డైలాగ్ చెప్తే అది ప్రోమోలోకి సూట్ అవుతుందో బాగా తెలిసినవాడు. ఆయన కామెడీ టైమింగ్ కూడా ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. కొంతకాలం క్రితం శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేసాడు అలా మల్లెమాల ప్రోగ్రామ్స్ కి ఆయన పర్మనెంట్ గా ఫిక్స్ ఐపోయినట్టు కనిపిస్తోంది.

ఇప్పుడు జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో వీడియో కింద ఆడియన్స్ కృష్ణ భగవాన్ జడ్జిగా చేసేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  ఇందులో రాకెట్ రాఘవ స్కిట్ మాములుగా లేదనిపిస్తోంది. ఇటీవల వచ్చిన ఉప్పెన మూవీ అప్పటిలో సూర్యకాంతం, రేలంగి కలిసి తీస్తే అందులో వాళ్ళ నటన ఎలా ఉంటుందో చూడముచ్చటగా చేసాడు రాకెట్ రాఘవ. సూర్యకాంతం దివి నుంచి భువికి దిగి బుల్లితెర మీద జబర్దస్త్ షోకి వచ్చి  స్కిట్ చేస్తోందా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆమె నడిచే విధానం, చేతిలో విసనకర్ర, కొప్పు, అందులో పూలు,  కళ్ళజోడు, మాట తీరు అచ్చు గుద్దినట్టుగా ఆమెను దించేసాడు. 

ఇక ఈ స్కిట్ కి అందరూ కుష్ ఇపోయారు. ఇంద్రజ ఆమెను డైరెక్ట్ గా చూడలేకపోయినా మీ రూపంలో చూసుకునే భాగ్యం చేసుకున్నాం అనేసరికి కృష్ణ భగవాన్ మధ్యలో వచ్చి "ఆవిడది మా ఊరే ..కైకవోలు" అనేసరికి "సూర్యకాంతం గారు వచ్చిన ఊరు నుంచా మీరొచ్చారు ? " అని ఇంద్రజ ఆశ్చర్యపోతూ అడిగేసరికి "ఆ అక్కడి నుంచి వచ్చి ఇదా మీరు... అన్నట్టుగా అంటున్నారు మీరు ? " అని ఇంద్రజకి  రివర్స్ లో కౌంటర్ వేసేసరికి అందరూ పగలబడి నవ్వారు. ఇక ఉప్పెన మూవీలోని  "జలజలా పాతం" సాంగ్ కి సూర్యకాంతం పడవలో చేసే నాట్యం ఈ వారం షోకి హైలైట్ గా నిలిచిపోయేలా కనిపిస్తోంది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.